బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖలలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 12 నుంచి జనవరి 10వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
మొత్తం ఖాళీలు: 400
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు (01.12.2025 నాటికి): అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు. కాగా.. గరిష్ట వయస్సు 28 సంవత్సరాల వయస్సు ఉంటుంది. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ లకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్ (జీతం): నెలకు రూ. 13,000 (ఇందులో రూ. 8,500 బ్యాంకు చెల్లిస్తుంది. రూ. 4,500 ప్రభుత్వం DBT ద్వారా చెల్లిస్తుంది) స్టైఫండ్ చెల్లిస్తారు.
శిక్షణ కాలం: ఏడాది పాటు అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.
సూచన: గతంలో ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేసిన వారు లేదా ఒక సంవత్సరం కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు అనర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా NATS పోర్టల్‌లో నమోదై ఉండాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభం: డిసెంబర్ 15 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్లకు చివరి తేదీ: జనవరి 1 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష: 100 మార్కులు (జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్ & రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్).
స్థానిక భాషా పరీక్ష: అభ్యర్థి అప్లై చేసుకున్న రాష్ట్ర భాషపై పట్టు ఉండాలి (చదవడం, రాయడం, మాట్లాడటం).
అప్లికేషన్ ఫీజు:
ముందుగా nats.education.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ bankofindia.bank.in లోకి లాగిన్ అవ్వాలి.
అనంతరం ‘Career’ సెక్షన్‌లోకి వెళ్లి అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ లింక్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి అప్లై చేసి సబ్మిట్ చేయాలి.





