ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’.. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 1100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వెల్త్ ఎగ్జిక్యూటివ్ , క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణియించారు. ఇదిలా ఉంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కాగా గడువు రేపటితో ముగియనుంది. కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
పోస్టుల వివరాలు, ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా ‘వెల్త్ ఎగ్జిక్యూటివ్ (జేఎంజీ/ఎస్-1)’ పోస్టులు 1,000 వరకు ఉండగా, ‘క్రెడిట్ అనలిస్ట్ (ఎంఎంజీ/ఎస్-11)’ పోస్టులు 100 ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు, వయోపరిమితి:
వెల్త్ ఎగ్జిక్యూటివ్: ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత సర్టిఫికేషన్, అలాగే వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
క్రెడిట్ అనలిస్ట్: డిగ్రీతో పాటు మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ పీజీ డిగ్రీ/డిప్లొమా లేదా ఎంకామ్ పూర్తి చేసి ఉండాలి.కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: ఈ రెండు పోస్టులకు అభ్యర్థుల వయస్సు 01.09.2026 నాటికి 21 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
జీతం:
వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టలకు నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు జీతం లభిస్తుంది.
క్రెడిట్ అనలిస్ట్‌కు పోస్టలకు నెలకు రూ. 64,820 నుంచి రూ. 93,960 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కోసం ఆన్ లైన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష కేంద్రాలు:
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సహా పలు ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.





