భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పనిచేసేందుకు 105 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 24వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. డిగ్రీ పూర్తి చేసి 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
విభాగాల వారీగా ఖాళీలు: మేనేజర్-డిజిటల్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్లో 15 ఖాళీలున్నాయి. 40 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, 20 క్రెడిట్ ఆఫీసర్ – ఎక్స్‌పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్ జాబ్స్, ఫోరెక్స్(ఆక్యుసిషన్ & రిలేషన్‌షిప్ మేనేజర్)లో – 30 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. జీతం నెలకు రూ.69,180 నుంచి రూ.89,890 వరకు చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ టెస్ట్, సైకియాట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్(జీడీ)/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని తదుపరి ప్రక్రియ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ నాలుగు అంశాల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ల్యాంగ్వేజీ పరీక్ష మినహా అన్ని పరీక్షలు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 150 నిమిషాలు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతీ తప్పు ప్రశ్నకు 0.25 మార్కు తొలగిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 75 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. మొత్తం 150 ప్రశ్నలు 225 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ మార్చి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
వెబ్సైట్: www.bankofbaroda.in