ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కాంట్రాక్ట్ పద్ధతిలో స్పెషలిస్ట్ ఐటీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 52
పోస్టులు:
1) డెవలపర్ (ఫుల్ స్టాక్ జావా, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్): 24
2) క్వాలిటీ అజ్యూరెన్స్ ఇంజినీర్లు: 12
3) క్వాలిటీ అజ్యూరెన్స్ లీడ్: 2
4) యూఐ/ యూఎక్స్ డిజైనర్: 2
5) క్లౌడ్ ఇంజినీర్: 2
6) అప్లికేషన్ ఆర్కిటెక్ట్: 2
7) ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్: 2
8) టెక్నాలజీ ఆర్కిటెక్ట్: 2
9) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్: 2
10) ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్: 2
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టు బట్టి 23 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష మొత్తం 225 మార్కులకి నిర్వహిస్తారు. నాలుగు సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 150 నిమిషాలు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్, హిందీ మీడియాల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున తొలగిస్తారు.
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
1) రీజనింగ్ 25 25
2) ఇంగ్లిష్ 25 25
3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 25
4) ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 150
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేయాలి.
చివరి తేది: 28 డిసెంబర్
వెబ్సైట్: www.bankofbaroda.in