ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ గడువును పొడిగించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1100 వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు..
పోస్టుల వివరాలు, ఖాళీలు:
వెల్త్ ఎగ్జిక్యూటివ్: 1000 పోస్టులు (వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ).
క్రెడిట్ అనలిస్ట్: 100 పోస్టులు (కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్ ).
మొత్తం 1100 పోస్టులకు గాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోస్టర్ పాయింట్ల వారీగా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
విద్యార్హతలు, అనుభవం:
వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండటంతో పాటు IC38, NISM సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఎంబీఏ (MBA Finance/Marketing) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు: డిగ్రీతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం ఉండాలి.
వయస్సు , అప్లికేషన్ గడువు:
అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి 21 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు లభిస్తుంది.
అప్లికేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 1వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
జీతం:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంపికైన అధికారులకు జీతాలు లభిస్తాయి.
వెల్త్ ఎగ్జిక్యూటివ్ (Scale-I) పోస్టులకు పే-స్కేల్: రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు ఉంటుంది.
క్రెడిట్ అనలిస్ట్ (Scale-II) పోస్టులకు పే-స్కేల్: రూ. 64,820 నుంచి రూ. 93,960 వరకు చెల్లిస్తారు. ఇవి కాకుండా బ్యాంక్ నిబంధనల ప్రకారం అలవెన్సులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసి అభ్యర్థులకు నాన్-రీఫండబుల్ ఫీజు: రూ. 850/- + గేట్‌వే ఛార్జీలు.
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు , మహిళా అభ్యర్థులకు ఫీజు: రూ. 175/- + గేట్‌వే ఛార్జీలు.
ఫీజును కేవలం ఆన్‌లైన్ (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ) ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఎంపిక విధానం :ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ (GD), పర్సనల్ ఇంటర్వ్యూ (PI) నిర్వహిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంట్స్, జనరల్ అవేర్‌నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ bankofbaroda.bank.in సంప్రదించవచ్చు.





