బ్యాంక్ జాబ్స్‌కు ఎదురుచూస్తున్న వారికి మరో అవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడా 346 పోస్టుల భర్తీకి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ ఖాళీల నియామకానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్, గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్), ఆపరేషన్స్ హెడ్-వెల్త్ లాంటి పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. డిగ్రీతో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ | 320 |
ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ | 24 |
గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్) | 1 |
ఆపరేషన్స్ హెడ్-వెల్త్ | 1 |
మొత్తం ఖాళీలు | 346 |
అర్హతలు;
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్- డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు NISM/ IRDA సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్- డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు NISM/ IRDA సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదిన్నర అనుభవం ఉండాలి.
గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్)– డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
ఆపరేషన్స్ హెడ్-వెల్త్- డిగ్రీ పాస్ కావాలి. ఎంబీఏ లేదా తత్సమాన అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్లు;
చివరి తేదీ- 2022 అక్టోబర్ 20
వయస్సు- 24 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.