బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో రిలేషనల్‌షిప్ మేనేజర్స్, క్రెడిట్ అనలిస్టుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 325 పోస్టుల్లో రిలేషనల్‌షిప్ మేనేజర్లు–175, క్రెడిట్ అనలిస్టు పోస్టులు 150 ఉన్నాయి.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు ఫైనాన్స్ విభాగంలో పీజీ డిగ్రీ/ సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. పోస్టును బట్టి 28 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్షన్ చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
1) రీజనింగ్ 25 25
2) ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 25
3) ఆప్టిట్యూడ్ 25 25
4) ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 150
అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ www.bankofbaroda.in సంప్రదించాలి.
ఐడీబీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 226 ఖాళీల్లో గ్రేడ్ బి మేనేజర్లు–82, గ్రేడ్ సి – అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు 111, గ్రేడ్ డి – డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు 82 ఉన్నాయి.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత. వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్: జూన్ 25 నుంచి జులై 10వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 ఉంటుంది. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ www.idbibank.in సంప్రదించాలి.