బ్యాంక్ ఆఫ్ బరోడా.. దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లో మొత్తం 1,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రధానంగా రెండు రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మొదటిది వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ కింద 1,000 వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, రెండవది కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్ కింద 100 క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ వివరాలు:
విద్యార్హతలు:
వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు IC 38 (ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), NISM సిరీస్ VA (మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు), NISM సిరీస్ XXI-A (PMS డిస్ట్రిబ్యూటర్లు), లేదా NISM సిరీస్ VD (మ్యూచువల్ ఫండ్ – స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు)లలో ఏదైనా ఒక చ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
ప్రాధాన్యత: మేనేజ్‌మెంట్‌లో 2 సంవత్సరాల పూర్తికాల పీజీ డిగ్రీ/డిప్లొమా లేదా MBA (ఫైనాన్స్/మార్కెటింగ్/బ్యాంకింగ్) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు, బ్రోకింగ్ లేదా వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
క్రెడిట్ అనలిస్ట్ – C&IC : ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పూర్తి చేసి ఉండాలి.
అనుభవం: షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. కార్పొరేట్ క్రెడిట్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
గమనిక: సెప్టెంబర్ 1, 2026 నాటికి ఏదైనా సంస్థలో ఆరు నెలల కంటే తక్కువ పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉంటే అది అర్హత కోసం పరిగణించరు.
వయస్సు: వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 21 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం,ఎంపిక ప్రక్రియ:
ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగ.. నిబంధనల ప్రకారం జీతం ఉంటుంది. వెల్త్ ఎగ్జిక్యూటివ్ ,క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో.. భాగంగా ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ , పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 4 న ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు రూ.850 + గేట్‌వే ఛార్జీలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు రూ. 175 + గేట్‌వే ఛార్జీలు చెల్లించాలి.
అప్లికేషన్ విధానం:
అర్హత, ఆసక్తి గలవారు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి.





