బ్యాంక్ ఆఫ్ బరోడా.. ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 330 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ మేనేజర్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్ 19వ తేదీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు:
అసిస్టెంట్ మేనేజర్- 300
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్- 08
డిప్యూటీ మేనేజర్ – 22
అర్హతలు: అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అర్హత కలిగి ఉండాలి.
అప్లికేషన్ చివరి తేదీ: అభ్యర్థులు ఆగస్ట్ 19 వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు జూన్ 1 నాటికి 23 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్, EWS & OBC అభ్యర్థులు రూ.850/ చెల్లించాల్సి ఉంటుంది.
SC, ST, PWD, ESM (మాజీ సైనికులు) & మహిళా అభ్యర్థులు రూ.175 చెల్లించాలి.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు చెల్లించే జీతం వారి అర్హతలు, అనుభవం, ప్రస్తుత మార్కెట్ బెంచ్‌మార్క్ ఆధారంగా నిర్ణయిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (https://www.bankofbaroda.in/) ద్వారా అప్లై చేసుకోవాలి.





