HomeJOBSబ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 ఉద్యోగాలు.. ఇంకా 4 రోజులే ఛాన్స్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 ఉద్యోగాలు.. ఇంకా 4 రోజులే ఛాన్స్

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంలో ఒక సంవత్సరం పాటు ఆన్-ది-జాబ్ శిక్షణ పొందే అద్భుత అవకాశం లభిస్తుంది. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.

పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు- 2700
సంస్థ పేరు- బ్యాంక్ ఆఫ్ బరోడా
పోస్ట్ పేరు- అప్రెంటిస్‌

అర్హతలు:
అభ్యర్థులు ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు:(01-11-2025 నాటికి)
అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్లకు చివరి తేదీ: అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

శిక్షణా కాలం: ఏడాది పాటు అభ్యర్థులకు శిక్షణ అందిస్తారు. ఈ సమయంలో రూ.15 వేల స్టైఫండ్ ఇస్తారు.

అధికారిక వెబ్‌సైట్: bankofbaroda.bank.in

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
దేశవ్యాప్తంగా 2700 ఖాళీలు ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ- 154
ఏపీ- 38
కర్ణాటక- 440
గుజరాత్- 400
మహారాష్ట్ర- 297
ఉత్తర ప్రదేశ్- 307
రాజస్థాన్- 215

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కింది మూడు దశల్లో జరుగుతుంది.

ఆన్‌లైన్ పరీక్ష: దీనిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు.

స్థానిక భాష : అభ్యర్థి అప్లై చేసిన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ టెస్ట్‌లో తెలుగు లేదా ఉర్దూ భాషలో ప్రావీణ్యం ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. జనరల్/EWS/OBC అభ్యర్థులు రూ.800 లతో పాటు జీఎస్టీ చెల్లించాలి. PwBD అభ్యర్థులు రూ. 400లతో పాటు జీఎస్టీ చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎలా అప్లై చేయాలి ?

ముందుగా.. అభ్యర్థులు తప్పనిసరిగా NATS (https://nats.education.gov.in) లేదా NAPS (https://www.apprenticeshipindia.gov.in)లో రిజిస్టర్ చేసుకోవాలి.
తర్వాత.. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.bank.in కి వెళ్లి, ‘Careers’ఆప్షన్స్‌పై క్లిక్ చేసి.. Apprenticeship 2025 నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. తర్వాత అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. చివరిగా.. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here