HomeJOBSబ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులతో పాటు మరికొన్ని ఇతర భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 104 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పోస్టును బట్టి కనీసం 2 నుంచి 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. ఏప్రిల్ 16 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు – 104
విభాగాల వారిగా..

డిప్యూటీ మేనేజర్
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్
ఇతర పోస్టులు

అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ (MBA/CA/CFA/ICWA) ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి కనీసం 2 నుంచి 5 ఏళ్ల వరకు బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో అనుభవం అవసరం.

వయస్సు:
పోస్టుల ఆధారంగా వయస్సు మారుతుంది. సాధారణంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్లకు చివరి తేదీ:
అభ్యర్థులు ఏప్రిల్ 16 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:
ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 850(GSTతో కలిపి) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 175 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత.. పర్సనల్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.

అప్లికేషన్ విధానం:
1.అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ https://bankofbaroda.bank.in లోకి లాగిన్ అవ్వాలి.

2.’Careers’ విభాగంలో నోటిఫికేషన్‌ను క్లిక్ చేయాలి.

3.అర్హతలను చెక్ చేసి, ఆన్‌లైన్ ఫారమ్‌ పూర్తి చేయాలి.

4.అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.

  1. అనంతరం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here