బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (bankofbaroda.in) లో ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer)
గ్రేడ్: జూనియర్ మేనేజిమెంట్.
గ్రేడ్ స్కేల్-I (JMG/S-I)
మొత్తం ఖాళీలు: 2500.
అప్లికేషన్ ప్రారంభం: జులై 4.
అప్లికేషన్ చివరి తేదీ: జులై 24 .
అర్హతలు:
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
- షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరంపాటు ఆఫీసర్‌గా పని చేసిన అనుభవం తప్పనిసరి.
- NBFCలు, కోఆపరేటివ్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీల్లో అనుభవం లెక్కలోకి తీసుకోరు.
- అభ్యర్థి అప్లై చేసిన రాష్ట్రంలోనే పనిచేయాల్సి ఉంటుంది.
- ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి.
వయస్సు : జులై 1, 2025 నాటికి అభ్యర్థి వయస్సు 21–30 సంవత్సరాల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది) .
సిబిల్ స్కోర్: కనీసం 680 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
ఫీజు వివరాలు: జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు: ₹850, ఎస్సీ, ఎస్టీ, PwBD, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు: ₹175.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, భాషా ప్రావీణ్యత పరీక్ష (LPT), సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం, ఇతర ప్రయోజనాలు: ప్రారంభ జీతం: రూ. 48,480/-, అదనంగా ప్రత్యేక అలవెన్సులు, ఉంటాయి.
ప్రొబేషన్ పీరియడ్: 12 నెలలు.