నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన..బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB).. దేశ వ్యాప్తంగా.. వివిధ రాష్ట్రాల్లో.. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా.. 2,482 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీలో 80, తెలంగాణలో 50 చొప్పున ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో.. పాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.. ఈ పోస్టుల కోసం అప్లికేషన్లు ఇప్పటికే ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 7 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
మొత్తం 2482 పోస్టులను దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భర్తీ చేస్తున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా పోస్టులను కేటాయించారు. ఏపీలో మొత్తం 80 పోస్టులు (ఎస్సీ-12, ఎస్టీ-5, ఓబీసీ-22, ఈడబ్ల్యూఎస్-8, జనరల్-33) ఉండగా, తెలంగాణలో మొత్తం 50 పోస్టులు (ఎస్సీ-8, ఎస్టీ-3, ఓబీసీ-14, ఈడబ్ల్యూఎస్-5, జనరల్-20) అందుబాటులో.. ఉన్నాయి. అభ్యర్థులు తాము అప్లై చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
విద్యార్హత, వయస్సు పరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో.. ఆఫీసర్గా కనీసం ఒక సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సులో సడలింపు లభిస్తుంది.
చివరి తేదీ, అప్లికేషన్ ఫీజు:
రిక్రూట్మెంట్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 18 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్లైన్లో.. అప్లై చేయడానికి సెప్టెంబర్ 7 వరకు అవకాశం ఉంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు కేవలం రూ.175 మాత్రమే ఉంటుంది. ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే చెల్లించవచ్చు.
జీతం,సెలక్షన్ ప్రాసెస్:
ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ రూ.48,480 నుంచి జీతం ప్రారంభమవుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. ముందుగా ఆన్లైన్ టెస్ట్, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ,లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.bankofbaroda.bank.in ద్వారా చివరి తేదీ సెప్టెంబర్ 7 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.





