HomeJOBSలోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు నేడే ఆఖరు తేదీ..వెంటనే అప్లై చేయండి!

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు నేడే ఆఖరు తేదీ..వెంటనే అప్లై చేయండి!

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 2482 పోస్టులను భర్తీ చేయనున్నారు.దీనికి సంబంధించి అప్లికేషన్ గడువు నేడు (సెప్టెంబర్ 17 తో) ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఏపీలో 80, తెలంగాణలో 50 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి ఇప్పటివరకు అప్లై చేసుకోని అర్హులైన అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
ఏపీ: మొత్తం 80 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. (ఎస్సీ-12, ఎస్టీ-5, ఓబీసీ-22, ఈడబ్ల్యూఎస్-8, జనరల్-33). స్థానిక భాషగా తెలుగు తప్పనిసరి.

తెలంగాణ: మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. (ఎస్సీ-8, ఎస్టీ-3, ఓబీసీ-14, ఈడబ్ల్యూఎస్-5, జనరల్-20). తెలుగు భాషపై మంచి పట్టు ఉండాలి.

అర్హతలు,వయస్సు:
విద్యార్హత:అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదనంగా ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో ఆఫీసర్‌గా కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 01.08.2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

జీతం:
JMG/S-I గ్రేడ్ కింద ఎంపికైన అభ్యర్థులకు రూ. 48,480 నుంచి ప్రారంభమై నిబంధనల ప్రకారం భత్యాలు లభిస్తాయి. కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం ఉన్నవారికి ఒక అదనపు ఇంక్రిమెంట్ కూడా అందిస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850(జీఎస్టీతో కలిపి), ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు రూ. 175 (జీఎస్టీతో కలిపి) అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?
1.అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.bank.in లోకి లాగిన్ అవ్వాలి.

2.’Careers’ సెక్షన్‌కు వెళ్లి ‘Current Opportunities’ పై క్లిక్ చేయాలి.

  1. తర్వాత LBO 2026 రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, మీ వివరాలను ఎంటర్ చేయాలి.

4.అనంతరం ఫొటో, సిగ్నేచర్, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.

5.చివరగా ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి, అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here