ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) 159 బ్రాంచ్ రిసీవబుల్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 14వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ/ఇతర సెలక్షన్ ప్రక్రియల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం www.bankofbaroda.in వెబ్సైట్ సంప్రదించాలి.