దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ నుంచి ఆఫీసర్ లెవల్ వరకు వివిధ పోస్టులు ఇందులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మల్టీ పర్సస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 413 పోస్టులు (తెలంగాణ), 170 (ఏపీ)కి సంబంధించి ఉన్నాయి. స్కేల్ వన్ ఆఫీసర్ పోస్టులు తెలంగాణలో 124, ఏపీలో 165 ఉన్నాయి. స్కేల్-2 ఆఫీసర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అయిదు పోస్టులున్నాయి.
ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన పోస్టులన్నింటికీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులు జులై ఒకటో తేదీ నుంచి ఆన్ లైన్ అప్లై చేసుకోవాలి. జులై 21వ తేదీ వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఉంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌కు అధికారిక వెబ్సైట్ www.ibps.in.
ప్రకటన పూర్తి వివరాలు..ఖాళీల పీడీఎఫ్ ప్రకటన ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
గ్రామీణ బ్యాంకుల్లో 413 ఉద్యోగాలు: ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్లు
Advertisement