వివిధ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల కామన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2023 –- 2024 సంవత్సరానికి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ)-XII పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం 6035 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్- లో 209, తెలంగాణ-లో 99 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ లు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 20 నుంచి -28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నలు వస్తాయి. సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
Kimuduputtu villege Gathum post Hukumpeta madalam
Padalaputtu villege kithalagi post dubhiriguda madalam
Kimuduputtu villege Gathum post Hukumpeta madalam