Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsవార్తల్లో వ్యక్తులు– అవార్డులు (జనవరి 2020)

వార్తల్లో వ్యక్తులు– అవార్డులు (జనవరి 2020)

వ్యక్తులు

అరుణ్‌కుమార్

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు డైరెక్టర్ అరుణ్‌కుమార్ సిన్హా పదవీకాలాన్ని కేబినెట్ నియామకాల కమిటీ  2021 జులై 30 వరకు పొడిగించింది. 1985లో ప్రధాని స్థాయి వ్యక్తి రక్షణ కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

సంతోష్ జి హొనావర్

పుణెకు చెందిన నేత్ర వైద్య నిపుణుడు సంతోష్ గజానన్ హొనావర్‌‌కు అమెరికన్ అకాడమి ఆఫ్ అప్తాల్మాలజీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది. ఈ పురస్కారం పొందిన తొలి ఇండియన్‌గా సంతోష్ నిలిచారు.

హర్జీత్ కౌర్ జోషి

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్‌‌పర్సన్‌గా హర్జీత్ కౌర్ జోషి ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమెను నియమించింది. 2022 మే 31 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు.

జ్యోతి యర్రాజీ

అఖిల భారత అంతర  విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ జాతీయ రికార్డ్‌ నెలకొల్పింది. 13.037సెకన్ల టైమింగ్‌తో 2002లో అనురాధ బిశ్వాల్ (13.38సెకన్ల) రికార్డును ఈమె బ్రేక్ చేసింది.

ఎం హన్మంతరావు

2019లో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించినందుకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావుకు  రాష్ట్ర ఎన్నికల సంఘం  ‘బెస్ట్ ఎలక్షన్ ఆఫీసర్’ అవార్డు ప్రదానం చేసింది. ఈ నెల 11న గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా హన్మంతరావు ఈ అవార్డు అందుకోనున్నారు.

లియోకార్టర్‌‌

న్యూజిలాండ్  టీ20 మ్యాచ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి లియోకార్టర్ రికార్డు నమోదు చేశాడు.  జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన 4వ వ్యక్తిగా, ఒవరాల్‌గా 7వ వ్యక్తిగా నిలిచాడు.

జస్టిస్ శేషశయనారెడ్డి

రాజీవ్‌గాంధీ   విజ్ఞాన సాంకేతిక(RGUKT) విశ్వవిద్యాలయ ప్రవేశాల్లో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ వెనకబాటు సూచిపై అధ్యయనం కోసం జస్టిస్ శేషశయనారెడ్డి అధ్యర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.

జోరాన్ మిలనోవిక్

క్రొయేషియా నూతన అధ్యక్షుడిగా జోరాన్ మిలనోవిక్ ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో సోషల్ డెమోక్రట్ అభ్యర్థి మిలనోవిక్ 52.7శాతం ఓట్లు సాధించగా, సెంటర్ రైట్ కూటమి నుంచి పోటీ చేసిన అధ్యక్షురాలు కొలిండా గ్రబర్ కిటరోవిక్‌ 47.3శాతం ఓట్లు సాధించారు. ఈమె క్రొయేషియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా 2015లో ఎన్నికయ్యారు.

పెడ్రో శాంచెజ్

స్పెయిన్ నూతన ప్రధానిగా పెడ్రో శాంచెజ్ జనవరి 8న ప్రమాణ స్వీకారం చేశారు. 1978 ప్రజాస్వామ్యం పునరుద్ధరించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేశారు. స్పెయిన్    రాజు ఫిలిప్పై–4 ఆధ్వర్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

సరబ్‌జీత్‌కౌర్‌‌

భారత వెయిట్ లిఫ్టర్ సరబ్‌జీత్ కౌర్‌‌ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నాలుగేండ్ల పాటు నిషేధానికి గురిచేసింది.2019లో విశాఖపట్నం కేంద్రంగా జరిగిన 72కేజీల మహిళల నేషనల్ చాంపియన్ షిప్ లో విజయం సాధించిన ఈమె  నిషేధిత డీ–హైడ్రాక్సీ ఎల్‌జిడి4033, సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేషన్ వాడినట్టు తేలడంతో నిషేధానికి గురైంది.

ఉమ్రె మోక్తర్

గినియా బిస్సౌ దేశ నూతన అధ్యక్షుడిగా ఉమ్రె మొక్తర్‌‌ను ఎన్నుకున్నారు. ఈయన మాడెమ్ జీ15 పార్టీకి చెందిన వ్యక్తి. ఇతను 2016–18వరకు ఆ దేశ ప్రధానిగా పనిచేశారు. ఇప్పటినుంచి ఆయన్ని ‘ది జనరల్‌’ గా వ్యవహరిస్తారు.

యువరాజ్ మాలిక్

నేషనల్ బుక్ ట్రస్ట్(ఎన్‌బిటీ) నూతన చైర్మన్‌గా యువరాజ్‌ మాలిక్ నియామకమయ్యారు. రిటా చౌదరి స్థానంలో వచ్చిన ఈయన ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా వ్యవహించారు.

రాణి రాంపాల్

భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న  హర్యాణకు చెందిన  రాణి రాంపాల్  ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌‌ –2019’ గా ఎంపికయ్యారు.

చంద్రపాల్ సింగ్ యాదవ్

రాజ్యసభ సభ్యుడైన చంద్రపాల్ సింగ్ యాదవ్ క్రిషాక్ భారతీ కో ఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్‌గా రెండోసారి ఎంపికయ్యారు. ఈయన  2015 నుంచి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ఎ.పి మహేశ్వరి

 ఉత్తరప్రదేశ్ కేడర్ 1984 ఐపీఎప్ బ్యాచ్‌కు చెందిన ఎ.పి మహేశ్వరీ  సెంట్రల్  రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌(సీఆర్‌‌పీఎఫ్​) కు నూతన డైరెక్టర్‌ జనరల్‌గా ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ 31న పదవీ విరమణ పొందిన రాజీవ్ భట్నాగర్ స్థానంలో ఈయన నియామకమయ్యాడు. 

మిఖాయిల్ మిషుస్టిన్

రష్యా నూతన ప్రధానికిగా మిఖాయిల్ మిషుస్టిన్ ఎన్నికయ్యారు.  రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ దేశంలో తీసుకువచ్చిన అధికారుల మార్పుల కారణంగా ప్రధాని పదవికి దిమిత్రి మెద్వెదివ్ రాజీనామా చేశారు.  ప్రస్తుతం సెక్యూరిటీ కౌన్సిల్ కు ఉప అధిపతిగా దిమిత్రి  వ్యవహరిస్తున్నాడు. ఈయన స్థానంలో మిఖాయిల్ బాధ్యతలు స్వీకరించారు.

చుని గోస్వామి

భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు  చుని గోస్వామి పోస్టల్‌ స్టాంప్‌ను జనవరి 16న పోస్టల్ డిపార్ట్‌మెంట్  విడుదల చేసింది. ఈయన 1962 లో బ్యాంకాక్ లో  జరిగిన ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించారు. గోస్థా పాల్(1998), తలిమెరెన్(2018) తరువాత గోస్వామి  పోస్టల్ స్టాంప్ ముద్రించబడ్డ మూడో ఫుట్‌బాల్ ఆటగాడిగా నిలిచాడు.

హరీష్ సాల్వే:

పాక్ మిలటరీ హైకోర్టు చే ఉరిక్షిక్ష ప్రకటించబడ్డ భారత రిటైర్డ్ నేవీ ఆఫీసర్ కులభూషన్ జాదవ్ కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే. ఈయన ఇటీవల  బ్రిటన్‌ రాణిచే ‘క్వీన్ కౌన్సిల్ ఫర్ కోర్ట్స్ ఆఫ్​ ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌’కు ఎంపికయ్యాడు.

బాపు నాదకర్ణి:

ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వరసనగా 21 మెడిన్  ఓవర్లు వేసి రికార్డు సృష్టించిన ఇండియా ఆల్ రౌండర్ క్రికెటర్. ఈయన జనవరి 17న  మృతి చెందాడు.

చంద్రశేఖర్ అయ్యర్:

కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్‌గా చంద్రశేఖర్ అయ్యర్ నియామకమయ్యారు. ఆర్‌‌కే గుప్తా కేంద్ర జల సంఘం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానాన్ని చంద్రశేఖర్ భర్తీ చేశారు.

మాధురి విజయ్:

భారత యువ సాహితి వేత్త మాధురి విజయ్ కశ్మీర్‌ ‌లోయలో పరిస్థితులపై రచించిన ‘ దిఫార్‌ ‌ఫీల్డ్‌’ నవలకు ప్రతిష్టాత్మక ‘క్రాస్ వర్డ్ బుక్ అవార్డు’ లభించింది.

కిరణ్​ మజుందార్ షా:

బయోకాన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న కిరణ్​ మజుందార్ షా ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ ఆర్డర్‌‌ ఆఫ్ ఆస్ర్టేలియా కు ఎంపికైంది. గతంలో సచిన్ టెండూల్కర్, సొలిసొరాబ్జు, మదర్ థెరిస్సా ఈ పురస్కారం అందుకున్నారు.

అభయ్ మనోహర్ సాప్రీ కమిటీ

రోడ్డు భద్రతపై తగిన సూచనలు చేయడానికి సుప్రీం కోర్టు చేత ఏర్పటైనా కమిటీకి   అభయ్ మనోహర్ సాప్రీ నూతన చైర్మన్‌గా నేతృత్వం వహించనున్నారు. ఇటీవల జస్టీస్ కె.ఎస్‌ సి రాధాకృష్ణ పదవి నుంచి వైదొలగడంతో ఆయన స్థానంలో అభయ్ మనోహర్ ఫిబ్రవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించారు.

అవార్డులు

లోకమాన్య తిలక్ అవార్డు

జర్నలిజంలో విశేషకృషికి అందించే లోకమాన్య తిలక్ జర్నలిజం అవార్డును జాగ్రాన్ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ సంజయ్ గుప్తాకు లభించింది. కేసరి–మరాఠా ట్రస్టు ఈ అవార్డును స్థాపించింది. దీనికింద రూ.లక్ష రూపాయలను అందిస్తారు.

హరివరాసనం అవార్డు

సంగీతంతో లౌకికవాదం, విశ్వవ్యాప్త శాంతి కోసం కృషి చేసినవారికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు 2012 నుంచి అందిస్తున్న హరివరాసనం అవార్డు ఈ ఏడాది ఇళయరాజాకు లభించింది. దీని విలువ రూ.లక్ష. తొలి అవార్డును ఏసుదాసు అందుకోగా తదనంతరం బాలసుబ్రమణ్యం అందుకున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

దేశంలో అత్యున్నత సినీ పురస్కారం 50వ ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ 2018 సంవత్సరానికి అమితాబ్‌ బచ్చన్‌కు లభించింది. అమితాబ్ ప్రస్తుతం జాతీయ కుటుంబ నియంత్రణ, టీబీ నియంత్రణ, పల్స్‌పోలియో, జీఎస్టీ, సిటీ కంపోస్ట్, గుజరాత్ పర్యాటక ప్రదేశాలకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా కొనసాగుతున్నారు. చిత్ర పరిశ్రమ పితామహుడు దుండిరాజ్ గోవిందరావు ఫాల్కే పేరుతో 1969లో స్థాపించిన ఈ అవార్డును సినీరంగంలో విశేష కృషికి అందిస్తారు.

ఆర్మీ మేనేజర్‌‌కు ఎక్సలెన్సీ అవార్డు

టెక్నాలజీ ఫర్ నాన్–కాంటాక్ట్ వెల్ఫేర్ అనే థీమ్‌తో న్యూఢిల్లీలో జరిగిన ఆర్మీ సాంకేతిక సదస్సులో మేజర్ అనూప్‌మిశ్రాకు ‘ఆర్మీ డిజైన్ బ్యూరో ఎక్సలెన్స్‌’ అవార్డు లభించింది. 10 మీటర్ల దూరం నుంచి వచ్చే బుల్లెట్‌ను కూడా తట్టుకునే ‘సర్వత్ర కవచ్‌’ను రూపొందించినందుకు ఈ అవార్డు దక్కింది.

సీకే నాయుడు లైఫ్‌టైమ్ అవార్డు

భారత క్రికెటర్లు క్రిష్ణమాచారి శ్రీకాంత్, అంజుం చోప్రాలకు 2019 సంవత్సరానికి సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. 1981–92 వరకు క్రికెటర్‌‌గా కొనసాగిన శ్రీకాంత్ ఒక వన్డేలో హాఫ్ సెంచరీతోపాటు, 5 వికెట్లు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌‌గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన అంజుంచోప్రా 1995–2012 వరకు ఇండియా తరఫున ఆడారు. మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్‌లో, లార్డ్స్ క్రికెట్ క్లబ్‌లో గౌరవ సభ్యత్వం పొందిన తొలి భారత మహిళా క్రికెటర్‌‌గా రికార్డు సృష్టించారు.  భారత క్రికెట్‌కు విశేష సేవలందించినవారికి బీసీసీఐ ప్రతి ఏటా ఈ అవార్డును అందిస్తుంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!