పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 105 ఖాళీలున్నాయి. కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తర్ణులైన అభ్యర్థులందరూ అర్హులే. వాలిడ్ గేట్ 2021 స్కోర్ ఉండాలి.
విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్ సైన్స్-37, ఎలక్ట్రికల్-60, సివిల్-04, ఎలక్ట్రానిక్స్-04.
వయసు: 31 డిసెంబర్ 2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
సాలరీ: ట్రెయినింగ్ పీరియడ్‌లో నెలకి రూ.40,000 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. విజయవంతంగా ఏడాది ట్రెయినింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు (ఇంజినీర్ ఈ 2 స్కేల్) నెలకి రూ.50,000 నుంచి రూ.1,60,000 + ఇతర అలవెన్సులు అందజేస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్ 2021 మెరిట్ స్కోర్, బిహేవియరల్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27 జనవరి
చివరి తేది: 20 ఫిబ్రవరి
వెబ్సైట్: www.powergrid.in