ఆర్ యూ సిస్ జెండర్… ఆర్ యూ సిస్ జెండర్.. ప్లీజ్ టిక్ దిస్.. ఆర్ అన్సర్ మి.. అవును ఐటీ కంపెనీల్లో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లే యువతీ యువకులందరికీ ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న ఇదే. అసలు టాప్ ఐటీ కంపెనీలుగా పేరున్న ఎంఎన్సీలన్నీ ఇదే ప్రశ్నను సంధిస్తున్నాయి. దీంతో యువతీ యువకులు షాక్ కు గురవుతున్నారు. అసలెందుకీ ప్రశ్న.. దీని వెనుక ఏముంది..? సిస్ జెండర్ అంటే ఏమిటీ..? ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు..? దీనికి ఎస్.. అని చెప్పాలా..? నో అని చెప్పాలా…? అనేది ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఇంతకాలం ఐటీ జాబ్స్ కు అప్లై చేసేవారికి ఆన్లైన్లోనైనా.. ఆఫ్ లైన్ లోనైనా జెండర్ మేల్.. ఆర్ ఫిమేల్ అనే ఆప్షన్ ఉండేది. మగ అయితే మేల్.. ఆడ అయితే ఫిమేల్ అనే ఛాయిస్ ఇవ్వడం ఈజీగా ఉండేది. రెండేండ్లుగా ఈ రెండు జెండర్లతో పాటు ట్రాన్స్ జెండర్ అనే థర్డ్ ఆప్షన్ కూడా కొన్ని ఎంఎన్సీ కంపెనీలు మాండేట్‌గా అడుగుతున్నాయి. తమ అప్లికేషన్లలో ఈ ఆప్షన్ పొందుపరిచాయి. ఇప్పుడు కొత్తగా సిస్ జెండర్ అనే ఆప్షన్ అడుగుతున్నాయి. దీంతో యువతీ యువకులు ఇక్కడేం టిక్ చేయాలో అంతుచిక్కక తల పట్టుకుంటున్నారు.
సిస్ జెండర్ అంటే ట్రాన్స్ జెండర్ కు పక్కా అపోజిట్ వర్డ్. మగ వాళ్లు ఆడ లక్షణాలతో ఉంటే.. వాళ్ల నడక, నడత, నడవడికతో పాటు శరీరంలో ఆడవాళ్ల ఆకృతిలో మార్పులుంటే వాళ్లను ట్రాన్స్ జెండర్లుగా పిలుస్తారు. కొందరు ఏకంగా సర్జరీల ద్వారా పూర్తిగా ఆడవాళ్లుగా మారేందుకు సర్జరీలు చేయించుకుంటున్నారు. వీళ్లందరూ ట్రాన్స్ జెండర్లే. దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్లకు ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఓటర్ల లిస్టులోనూ వీళ్లను ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్లుగా నమోదు చేస్తున్నారు. మరి.. ఇప్పుడు ఐటీ కంపెనీలు కొత్తగా ట్రాన్స్జెండర్ ఆర్ సిస్ జెండర్ అని ఎందుకు అడుగుతున్నాయనే సందేహం రావటం సహజం.
సిస్జెండర్ అంటే బై బర్త్ ఏ జెండర్ లో ఉన్నవాళ్లు.. అదే జెండర్‌గా కొనసాగటం.. అంటే పుట్టుకతో ఉన్న లక్షణాలు ఏమీ మారిపోలేదని తమకు తాముగా సర్టిఫై చేసుకున్నట్లు లెక్క. ఆడగా పుట్టిన వారు ఆడ లక్షణాలే ఉన్నాయని.. మగ బిడ్డగా పుట్టిన వారికి పురుష లక్షణాలే ఉండటం సిస్జెండర్ అని చెప్పుకోవటం.
మేల్, ఫిమేల్ జెండర్లో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకున్నాక.. మళ్లీ ఈ సిస్ జెండర్ ఆప్షన్ అవసరమా అనేది ఐటీ జాబ్ సీకర్స్ను వేధిస్తున్న సమస్య. అసలు ట్విస్ట్ ఏమిటంటే.. సిస్ జెండర్ అని టిక్ చేసుకున్నాక భవిష్యత్తులో ట్రాన్స్‌జెండర్‌గా బిహేవ్ చేసినట్లయితే.. తమ ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా.. అనేది క్వచ్ఛన్ మార్క్. నిజానికి అలా చేస్తే ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఆ కంపెనీల చేతిలో ఉంటుందనేది ఐటీ ఉద్యోగులు చెబుతున్న మాట. అందుకే సిస్ జెండర్ అనే ఆప్షన్ ప్రత్యేకంగా పెట్టాయని అంటున్నారు.
అంటే.. ట్రాన్స్జెండర్‌లకు ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వటం లేదా..? ట్రాన్స్జెండర్లపై ఐటీ కంపెనీలకు ఉన్న వివక్షనా.. అనేది చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి సిస్ జెండర్ అనేది ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో షాకింగ్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. అందుకే ఐటీ కంపెనీల ఇంటర్వ్యూలకు, ఐటీ జాబ్ సీకర్స్ అప్లికేషన్లు నింపేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. సిస్జెండర్..ఆర్ ట్రాన్స్జెండర్ అని ఆప్షన్ ఉంటే ఆ కంపెనీ రూల్స్ ఏమిటో మరోసారి తెలుసుకొని జాయినవండి.
రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఐటీ ఇండస్ట్రీ తప్ప మిగతా ఇండస్ట్రీలన్నీ కరోనా ధాటికి దెబ్బతిన్నాయి. ఒక్క కరోనాతో బాగుపడ్డ రంగం ఏదన్నా ఉన్నదంటే ఐటీ సెక్టారే. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కు గ్రీన్సిగ్నల్ ఇచ్చేసిన ఐటీ కంపెనీలన్నీ భారీగా లాభాల బాట పడ్డాయి. ప్రొడక్టివిటీ పెరగటంతో పాటు నిర్వహణ ఖర్చులన్నీ తగ్గిపోవటంతో ఐటీ కంపెనీలన్నీ గతం కంటే రేసింగ్ మూడ్లో ఉన్నాయి. ఈ టైమ్లో ఈ సిస్ జెండర్ ఎందుకు గుర్తుకు వచ్చిందో.. నిజంగానే హాట్ టాపిక్.