HomeLATESTఆర్కిటెక్చర్​ డిగ్రీ ఎంట్రన్స్​ (నాటా): ఆగస్టు 12 వర​కు అప్లికేషన్లు

ఆర్కిటెక్చర్​ డిగ్రీ ఎంట్రన్స్​ (నాటా): ఆగస్టు 12 వర​కు అప్లికేషన్లు

బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అడ్మిషన్లకు జాతీయ స్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్​ ‘నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా). ప్రతి ఏడాది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏటా రెండు సార్లు ఈ ఎంట్రన్స్​ నిర్వహిస్తుంది. కరోనా కారణంగా ఈ ఏడాది తొలి విడత జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్టు 28న నాటా-2020 ఎగ్జామ్​ నిర్వహించేందుకు షెడ్యూలు ప్రకటించింది.

Advertisement

కోర్సు;  బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)
కోర్సు వ్యవధి;
అయిదేళ్లు.
అర్హత;  మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 50% మార్కులు, మొత్తం కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాసైన విద్యార్థులందరూ అర్హులు.
పరీక్ష విధానం; 200 మార్కులకు ఈ ఎంట్రన్స్​ ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి రెండు భాగాలు ఉంటాయి. పార్ట్-ఎ డ్రాయింగ్​పై, పార్ట్-బిలో ఫిజిక్స్​ కెమిస్ట్రీ మ్యాథ్స్​, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్​ ప్రశ్నలుంటాయి.

ఆన్​ లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: ఆగస్టు 12
తొలి విడత పరీక్ష తేదీ: ఆగస్టు 29.
పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 10‌‌ నుంచి 12, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు

మొదటిసారిగా ఈ ఏడాది నాటాలో డ్రాయింగ్ టెస్ట్ కూడా ఆన్​లైన్​లో నిర్వహిస్తున్నారు. దీనికి అనుగుణంగా సిలబస్​ మార్చారు. గతంలో డ్రాయింగ్ టెస్ట్ అభ్యర్థి స్కిల్స్ ను పరీక్షించేదిగా ఉండేది. దాన్ని ఇప్పుడు అవగాహన పరీక్షించేదిగా మార్పు చేశారు. అభ్యర్థి కంప్యూటర్ ముందు కూర్చొని సమాధానాలు ఇస్తే సరిపోతుంది.

Advertisement

అభ్యర్థులు ఈసారి ఎంట్రన్స్​ను ఇంటి నుంచే రాసేందుకు వెసులుబాటు కల్పించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, పర్సనల్ కంప్యూటర్, ల్యాప్​ టాప్​, వెబ్ క్యామ్ వంటి టెక్నికల్/హార్డ్ వేర్ సదుపాయం లేని వాళ్లు కౌన్సిల్ కేటాయించిన ఎగ్జామ్​ సెంటర్​ నుంచి పరీక్ష రాసే వీలుంది.
పూర్తి వివరాలకు
http://www.nata.in/

పూర్తి వివరాలు ఈ పీడీఎఫ్​ లో ఉన్నాయి. డౌన్​ లోడ్​ చేసుకునే వీలుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!