ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్–2025 విడుదలైంది. ప్రభుత్వ టీచర్లతో పాటు బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 24న ప్రారంభమయ్యాయి. చివరి తేది నవంబర్ 23.
అర్హతలు
పేపర్–1 రాసేందుకు ఇన్‌సర్వీస్ ప్రైమరీ టీచర్లతో పాటు కనీసం 50శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి, డీఈడీ అర్హత కలిగిన వారు అర్హులు. పేపర్–2 రాసేందుకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లతో పాటు డిగ్రీ+బీఈడీ 50శాతం మార్కులతో పాసైన టెట్‌కు అర్హులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 45శాతం ఉన్నా.. అనుమతిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
పేపర్–1, పేపర్–2 టెట్ పరీక్షకు ప్రత్యేకంగా రూ.1000 ఫీజు చెల్లించాలి. రెండు రాసేవారు కూడా విడిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొదట మొబైల్ నం. ఈమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటీపీ వెరిఫికేషన్ అనంతరం సర్టిఫికేట్లు, ఫొటోలు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
పరీక్ష డిసెంబర్ 10 న రెండు సెషన్లలో నిర్వహిస్తారు. పేపర్ –1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్ –2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. హాల్‌టికెట్లు డిసెంబర్ 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఫలితాలను జనవరి 19న విడుదల చేస్తారు.
పరీక్ష విధానం
టెట్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. మల్టీఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. సమయం 2.30గంటలు ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్–2, పేపర్–2లో సైకాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 సబ్జెక్టులు కామన్‌గా ఉంటాయి. వీటితో పాటు పేపర్ 1 రాసే వారికి మ్యాథ్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, పేపర్ 2 వారికి మ్యాథ్స్, సైన్స్, లేదా సోషల్ స్టడీస్ ఉంటుంది.
అప్లై చేసేందుకు వెబ్సైట్: https://aptetv2.apcfss.in/





