ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులను అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు apsrtc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)
పోస్ట్ పేరు: అప్రెంటిస్ (వివిధ ITI ట్రేడ్‌లు)
మొత్తం పోస్టులు:291
ఖాళీల వివరాలు:
ఎన్టీఆర్ జిల్లా – 87
కృష్ణ- 41
పశ్చిమ గోదావరి- 22
ఏలూరు- 44
గుంటూరు- 30
బాపట్ల- 29
పల్నాడు- 38
ట్రేడ్ వారీగా ఖాళీలు..
డీజిల్ మెకానిక్- 38
ఎలక్ట్రీషియన్- 87
మెకానిక్ (MV) -41
ఫిట్టర్- 22
వెల్డర్- 44
టర్నర్- 30
మెకానిక్- 29
వయస్సు: అప్రెంటిస్‌షిప్ చట్టం నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయస్సు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హత: అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీ నుంచి ITI కోర్సు పూర్తి చేసి ఉండాలి. NCVT సర్టిఫికేట్ తప్పనిసరి.
అప్లికేషన్లకు చివరి తేదీ: నవంబర్ 30 వ తేదీ వరకు అభ్యర్ధులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు రూ. 118 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
- మెరిట్ లిస్ట్ : ఎంపిక పూర్తిగా ITI (NCVT/SCVT) మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇందుకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు.
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్:
మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులను సంబంధిత APSRTC ప్రాంతీయ ఆఫీసుల్లో సర్టిఫికేట్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు SSC మార్క్స్ మెమో, ITI మార్క్స్ మెమో, NTC/NCVT సర్టిఫికేట్, ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
3. ఫైనల్ లిస్ట్:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన అప్రెంటిస్‌లఫైనల్ లిస్ట్ APSRTC ద్వారా విడుదల చేస్తారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు వారికి కేటాయించిన డిపోలో శిక్షణ షెడ్యూల్, రిపోర్టింగ్ తేదీ, అప్రెంటిస్‌షిప్ సమయానికి సంబంధించిన సూచనలను తెలియచేస్తారు
APSRTC అప్రెంటిస్ స్టైపెండ్ 2025:
RITES అప్రెంటిస్ జీతం 2025 లో ప్రాథమిక వేతనం మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్, వివిధ రకాల అలవెన్సులు, పెర్క్‌లు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తో పాటు వారికి, వారి కుటుంబాలకు వైద్య సౌకర్యాలు కూడా పొందుతారు. ఈ ప్రయోజనాలన్నింటినీ కలిపి, మొత్తం జీతం ప్యాకేజీ రూ. 9,000 వరకు ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
1.మందుగా అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్ లోకి లాగిన్ అవ్వాలి.
2.తర్వాత కుడి వైపున ఉన్న లాగిన్/రిజిస్టర్ పై క్లిక్ చేసి, అభ్యర్థి (Candidate) ఆప్షన్ ఎంచుకుని, రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
3.ఇప్పడు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఇమెయిల్‌కి వచ్చిన లింక్‌తో అకౌంట్ యాక్టివేట్ చేయండి. లాగిన్ అయిన తర్వాత.. ఆధార్ కార్డ్ e-KYC పూర్తి చేయండి.
4. తరువాత ప్రొఫైల్ అప్‌డేట్ ఆప్షన్ పై క్లిక్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి పూర్తి వివరాలను ఎంటర్ చేయండి.
5. అనంతరం అప్రెంటిస్ అవకాశాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత కోర్సు ట్రేడ్‌ను (మీరు ITI పూర్తి చేసిన ట్రేడ్), మీ జిల్లాకు సంబంధించిన APSRTC సంస్థను సెలక్ట్పై క్లిక్ చేసి అప్లైపై ఎంటర్ చేయండి. దీంతో అప్లికేషన్ పూర్తవుతుంది. వెంటనే ప్రింట్ అవుట్ తీసుకోండి.
అవసరమైన డాక్యుమెంట్స్:
టెన్త్ మార్క్స్ మెమో
ఐటీఐ మార్కుల మెమో
NTC/NCVT సర్టిఫికెట్
క్యాస్ట్ సర్టిఫికెట్
ఆధార్ కార్డు
బ్యాంక్ పాస్‌బుక్
E-KYC కాపీ





