ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత కల్పించే ‘ఏపీ సెట్ (APSET)కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్శిటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. మార్చి 28,29 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 9 నుంచి అప్లై చేసుకోవచ్చు.
ఏపీ సెట్ పూర్తి వివరాలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: జనవరి 9 నుంచి ఆన్ లైన్ విధానంలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: ఫిబ్రవరి 9 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
లేట్ ఫీజు: రూ. 2వేల లేట్ ఫీజుతో ఫిబ్రవరి 25వ తేదీ వరకు రూ. 5వేల లేట్ ఫీజుతో మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు: మార్చి 19 నుంచి అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: మార్చి 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
జనరల్/EWS అభ్యర్థులకు 55%, రిజర్వేషన్ వర్గాలకు (ఎస్సీ/ఎస్సీ/బీసీ/పీడబ్ల్యూడీ) 50% మార్కులు తప్పనిసరి.
పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
పరీక్షా విధానం :
సెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1: జనరల్ స్టడీస్ (టీచింగ్ & రీసెర్చ్ ఆప్టిట్యూడ్).
పేపర్-2: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు www.apset.net.in లేదా www.andhrauniversity.edu.in వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.





