ఏపీలోని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APSET-2025) నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. వైజాగ్‌లోని ఆంధ్ర యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ లో ఫిబ్రవరి 9 అప్లై చేసుకోవచ్చు.యుజీసీ (UGC) నిబంధనలకు అనుగుణంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 9వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: మార్చి 19 నుంచి హాల్ టికెట్లు అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
పరీక్ష తేదీలు: మార్చి 28, 29 తేదీల్లో సెట్ పరీక్షలు జరుగుతాయి.
పరీక్షా విధానం:
ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1: టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్
పేపర్-2: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై ఉంటుంది. మొత్తం 30 సబ్జెక్టులలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు.. రూ. 1,600, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు.. రూ. 1,300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు.. రూ. 900 ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.apset.net.in సందర్శించి ఆన్‌లైన్ ద్వారా.. వివరాలను ఎంటర్ చేయాలి. అప్లికేషన్ల సమయంలో అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రభుత్వ , ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించడానికి ఈ పరీక్ష అత్యంత కీలకం. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.





