ఏపీలోని పలు యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ (ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) అడ్మిషన్ల కోసం నిర్వహించే ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET)కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. కాగా పరీక్షల కోసం నేటి నుంచే ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. నవంబర్‌లో ఎంట్రన్స్ పరీక్షలు జరుగనున్నాయి. అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు పీజీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా.. సెట్, నెట్ అర్హత కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు: అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి అప్లై చేసుకోవచ్చు.
ఎంట్రెన్స్ పరీక్షలు ప్రారంభం: నవంబర్ 3 న పరీక్షలు ప్రారంభమై 7న పూర్తవుతాయి.
అర్హతలు:
అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా పీజీ (మాస్టర్స్ డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
మార్కుల శాతం: మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ప్రాధాన్యత: సెట్ (SET), నెట్ (NET) అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (APRCET), ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు.
పరీక్ష నిర్వహణ:
ఎంట్రెన్స్ పరీక్షలు: నవంబర్ 3వ తేదీన ప్రారంభమై.. నవంబర్ 7వ తేదీతో పరీక్షలు పూర్తవుతాయి.
ఫీజు చెల్లింపు: రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫీజును ఏపీ ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు.
ప్రవేశాలు కల్పించే కోర్సులు:
ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా.. కింది కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పిస్తారు.
ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ , ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లాతో పాటు మరికొన్ని ఇతర కోర్సులు.
అప్లికేషన్ విధానం: అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: అప్లికేషన్ ప్రక్రియ, పూర్తి వివరాల కోసం.. https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.





