ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను (APPSC Group-1 ) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఏపీలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను డిసెంబర్ 18వ తేదీన నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఈ ఎగ్జామ్ ను వచ్చే ఏడాది అంటే 2023 జనవరి 08న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్ సైట్లో (https://psc.ap.gov.in/) అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది ఏపీపీఎస్సీ. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. ఏపీలో 92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 13న ప్రారంభమైంది. నవంబర్ 2న దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడడంతో.. షెడ్యూల్ ప్రకారం 2023 మర్చి 15 తర్వాత నిర్వహించాల్సి ఉన్న మెయిన్స్ ఎగ్జామ్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమచారం. ఏపీపీఎస్సీ నుంచి ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.