ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: 730
1) జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (రెవెన్యూ డిపార్ట్‌మెంట్): 670
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 1 జూలై 2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకి నిర్వహిస్తారు.
1) జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు 100 నిమిషాలు 100 మార్కులు
2) జనరల్ ఇంగ్లిష్ అండ్ జనరల్ తెలుగు 50 ప్రశ్నలు 50 నిమిషాలు 50 మార్కులు
మెయిన్స్ ఆబ్జెక్టివ్ విధానంలో 300 మార్కులకి ఉంటుంది.
1) జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
2) జనరల్ ఇంగ్లిష్ అండ్ జనరల్ తెలుగు 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 30 నిమిషాలు 50 మార్కులు
2) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్): 60
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 1 జూలై 2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకి నిర్వహిస్తారు.
1) జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు 50 నిమిషాలు 50 మార్కులు
2) హిందూ ఫిలాసపీ అండ్ టెంపుల్ సిస్టం 100 ప్రశ్నలు 100 నిమిషాలు 100 మార్కులు
మెయిన్స్ మొత్తం 300 మార్కులకి నిర్వహిస్తారు.
1) జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
2) హిందూ ఫిలాసపీ అండ్ టెంపుల్ సిస్టం 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 30 డిసెంబర్ 2021.
చివరి తేది: 19 జనవరి 2022.
వెబ్సైట్: www.psc.ap.gov.in