ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుండగా, APPSC ఈ గడువును ఆగస్టు 10 వ తేదీ అర్ధరాత్రి 11:59 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు అప్లై చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కలిపి మొత్తం 691 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఇందుకు అర్హులు.
జీతం: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ.25, 200 నుంచి రూ.80,910 జీతం ఉంటుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు రూ. 23,120 నుంచి రూ.74,770 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://psc.ap.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.





