ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్ సెంట్రల్ రైల్వే ఈసీఆర్ పరిధిలోని డివిజన్/ వర్క్‌షాపుల్లో 1679 యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేయాలి.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు www.rrcpryj.org వెబ్సైట్లో సంప్రదించాలి.