దేశవ్యాప్తంగా ఐఓబీ బ్రాంచీల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు సెప్టెంబర్ 10వ తేదీ (ఈరోజే) చివరి తేదీ. మొత్తం 550 ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్లో 22; తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి. ఎంట్రన్స్ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది.
ముఖ్య తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-09-2024.
దరఖాస్తు రుసుము చెల్లింపు గడువు: 15.09.2024 వరకు.
ఆన్లైన్ పరీక్ష తేదీ: 22.09.2024.
ఖాళీల వివరాలు:
అప్రెంటిస్: 550 ఖాళీలు
(యూఆర్- 284, ఎస్సీ- 78, ఎస్టీ- 26, ఓబీసీ- 118, ఈడబ్ల్యూఎస్- 44)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 2024 ఆగస్ట్ 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. స్టైపెండ్: నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000; అర్బన్ ప్రాంతానికి రూ.12,000; సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000.
సబ్జెక్టులు: జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్/ సబ్జెక్ట్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు). పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550 అప్రెంటిస్.. నేడే చివరి తేదీ
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS