HomeJOBSఐటీఐ, ఇంటర్ అర్హతతో మహీంద్రాలో అప్రెంటిస్‌ ఉద్యోగాలు..

ఐటీఐ, ఇంటర్ అర్హతతో మహీంద్రాలో అప్రెంటిస్‌ ఉద్యోగాలు..

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్.. జహీరాబాద్ (AD-Zaheerabad) యూనిట్‌లో అప్రెంటిస్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నిరుద్యోగులకు మంచి నైపుణ్యం నేర్పించి, వారికి ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ ప్రకటన విడుదల చేసింది. టెన్త్, ఇంటర్,ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అప్రెంటిస్ షిప్ ద్వారా ట్రైనింగ్ లోనే జీతం పొందే వీలుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.

అర్హతలు:
ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కోసం కింది విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

1.ఐటీఐ

2.ఇంటర్

3.టెన్త్

వయస్సు: పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 11,400 స్టైఫండ్ లభిస్తుంది. అదనంగా.. రూ. 3,000 వరకు అటెండెన్స్ ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది.

అభ్యర్థుల సౌకర్యార్థం కోసం మరికొన్ని ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది.

1.సబ్సిడీ ధరకే క్యాంటీన్ సౌకర్యం.

2. ఉచిత లోకల్ బస్సు రవాణా సౌకర్యం.

కావలసిన డాక్యుమెంట్స్:

అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ ఫారం

టెన్త్ మెమో జిరాక్స్

ఐటీఐ లేదా ఇంటర్ మెమో జిరాక్స్

ఆధార్ కార్డు జిరాక్స్

బ్యాంక్ అకౌంట్ జిరాక్స్

బ్లడ్ గ్రూప్ సర్టిఫికెట్

రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

సంప్రదించాల్సిన వివరాలు:
మరిన్ని వివరాల కోసం లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి కింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
1.9542112252

2.8121339617

నిరుద్యోగ యువతకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో శిక్షణ పొంది, తమ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here