HomeLATESTఈసీఐఎల్​, బీఈఎల్​, డీఆర్​డీవో, ఏఏఐలో అప్రెంటీస్​.. 965 ఖాళీలు

ఈసీఐఎల్​, బీఈఎల్​, డీఆర్​డీవో, ఏఏఐలో అప్రెంటీస్​.. 965 ఖాళీలు

Advertisement

ఈసీఐఎల్​

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్​)-గ్రాడ్యుయేట్ ఇంజనీర్, టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్​ ఇంజినీర్​ అప్రెంటీస్​160(ఈసీఈ–100,సీఎస్​ఈ–25, మెకానికల్​–20, ఈఈఈ–5), టెక్నికల్​ అప్రెంటీస్​(డిప్లొమా) 20(ఈసీఈ–10, సీఎస్​ఈ–10) మొత్తం180 ఖాళీలున్నాయి.గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ లేదా బీఈ పాస్ కావాలి. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి.

2018 ఏప్రిల్ 1 తర్వాత పాసైనవారే అప్లై చేయాలి.
వయసు- 2021 జనవరి 31 నాటికి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ యూనిట్‌లో ఒక ఏడాది అప్రెంటీస్‌షిప్ శిక్షణ ఉంటుంది.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ పోస్టుకు రూ.9,000, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుకు రూ.8,000 స్టైఫండ్​ ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అప్లై చేయడానికి 2021 జనవరి 15 చివరి తేదీ.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ecil.co.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-
వెబ్‌సైట్ mhrdnats.gov.in లో అప్లై చేయాల్సి ఉంటుంది.

భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​


బెంగ‌ళూరుతోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌) అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. సీఎస్​ఈలో 25, ఈసీఈ 150, మెకానిక్​ 100, ఈఈఈ 25, కెమిక్​ ఇంజినీరింగ్​ 5 మొత్తం 305 పోస్టులు ఉన్నాయి. స్టేట్ కౌన్సిల్/బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేష‌న్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి

సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు
అర్హులు. వ‌య‌సు 22 ఏళ్లకు మించ‌కూడ‌దు.
మెరిట్​ ప్రకారం షార్ట్​ లిస్ట్​ చేసి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఏడాది ట్రైనింగ్​ ఉంటుంది.
అప్రెంటీస్​ పీరియడ్​లో నెలకు రూ.10,400 స్టైఫండ్​ ఇస్తారు.
జనవరి 19లోగా ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ bel-india.in లో చూడొచ్చు.


డీఆర్​డీవో

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్​( డీఆర్​డీవో) గ్రాడ్యుయేట్​, డిప్లొమా, ఐటీఐ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్ విభాగంలో 80, డిప్లొమా అప్రెంటీస్​ ట్రైనీ 30, ఐటీఐ అప్రెంటీస్​ ట్రైనీ 40 మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత రెండేళ్ల పాటు ఒకేషనల్ కోర్సు చేసిన వారు, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్​ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్​గా పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ. 9 వేల చొప్పున స్టైఫండ్​ ఇస్తారు.
అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 29 లోపు దరఖాస్తు చేసుకోవాలి.​
ఇతర వివరాలకు drdo.gov.in వెబ్​సైట్​ చూడొచ్చు.

Advertisement

ఏఏఐ

భార‌త ప్రభుత్వానికి చెందిన మినీర‌త్న సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. క‌ంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ప్రోగ్రామింగ్, స్టెనోగ్రాఫ‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్‌, ఫైనాన్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఆటోమొబైల్‌, ఎరోనాటిక్స్‌, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఫైర్ స‌ర్వీస్‌ విభాగాల్లో మొత్తం180 (ఐటీఐ-14, డిప్లొమా-73, గ్రాడ్యుయేట్‌-93) ఖాళీలు ఉన్నాయి.

స‌ంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/ఎన్‌సీవీటీ, డిప్లొమా(ఇంజినీరింగ్‌)/నాలుగేళ్ల ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత‌ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 26 ఏళ్లకు మించకూడదు.
అర్హత ప‌రీక్షలో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూ/ డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌కు పిలుస్తారు.
ఎంపికైన వారికి ఏడాది ట్రైనింగ్​ ఉంటుంది.
శిక్షణ కాలంలో ట్రేడును బట్టి నెలకు రూ. 9వేలు/12 వేలు/15 వేలు స్టైఫండ్​ ఇస్తారు.
జనవరి 24లోపు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

బీహెచ్​ఈఎల్​

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఝాన్సీలోని బీహెచ్ఈఎల్ యూనిట్‌లో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. ఇందులో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు 120 కాగా.. టెక్నీషియన్ లేదా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 30 ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు టెన్త్​ లేదా ఇంటర్​ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. మోడర్న్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రెటేరియట్​/ ప్రాక్టీస్ పోస్టులకు రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
దరఖాస్తులకు చివరి తేదీ. 2021, జనవరి 16
బీహెచ్ఈఎల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయడం కంటే ముందు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ పోర్టల్ apprenticeshipindia.org అలాగే ncvtmis.gov.in వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకోవాలి.
దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 జనవరి 23 లోగా పోస్టులో పంపాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను jhs.bhel.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!