Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSట్రాన్స్​ కోలో 92 అప్రెంటిస్​ ఖాళీలు.. ఇంజనీరింగ్​, డిప్లొమా అభ్యర్థులకు ఛాన్స్​

ట్రాన్స్​ కోలో 92 అప్రెంటిస్​ ఖాళీలు.. ఇంజనీరింగ్​, డిప్లొమా అభ్యర్థులకు ఛాన్స్​

హైదరాబాద్​లోని (TS TRANSCO) ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ కంపెనీలో అప్రెంటిస్​ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులకు ట్రాన్స్​కో కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఒక ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ అందిస్తోంది. ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా అభ్యర్థులు ఈ అప్రెంటిస్​షిప్​కు అర్హులవుతారు.

Advertisement

ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌, సివిల్‌, ఐటీ ఇంజనీరింగ్​ డిగ్రీతో పాటు డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్‌ఈ బ్రాంచీ డిప్లొమా అభ్యర్థులు ఈ ఖాళీలకు అర్హులు. అప్రెంటిస్​ అభ్యర్థులకు ప్రతి నెల రూ.8 వేల నుంచి రూ.9 వేలు స్టైఫండ్​ చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ​ ఏప్రిల్‌ 11లోగా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అభ్యర్థులు NATS పోర్టల్​ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి.

GRADUATE, TECHNICIAN (DIPLOMA) APPRENTICE
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 92 ఖాళీలు

విభాగాలు: ఇంజినీరింగ్‌ డిగ్రీ- ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌, సివిల్‌, ఐటీ; డిప్లొమా- డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్‌ఈ.

Advertisement

మంత్లీ స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.9000; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.8000 చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ (2020/ 2021/ 2022 సంవత్సరంలో) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

వయస్సు : 18 ఏళ్లు నిండి ఉండాలి. అప్రెంటిస్‌షిప్ శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

Advertisement

సెలెక్షన్​: అభ్యర్థి సంబంధిత డిగ్రీలో పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

https://portal.mhrdnats.gov.in/ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: 11.04.2023.

ట్రాన్స్‌కో దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2023.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!