HomeLATESTఈ నెలలోనే గ్రూప్‌-4 అభ్యర్థులకు అపాయింట్​మెంట్​ లెటర్స్​

ఈ నెలలోనే గ్రూప్‌-4 అభ్యర్థులకు అపాయింట్​మెంట్​ లెటర్స్​

తొలి ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. దాదాపు 500 రోజులుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నందున.. గ్రూప్​ 4 నియామకాలు చేపట్టనుంది. ఇప్పటికే గ్రూప్​ 4 ఫలితాలు వెల్లడయ్యాయి. సర్టిఫికేట్​ వెరిఫికేషన్ కూడా పూర్తయింది.

గతేడాది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది జులైలోనే గ్రూప్‌-4 పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 9,51,205 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అందులో 7,62,872 మంది పేపర్-1 పరీక్ష రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. ఎన్నికలతో పాటు వివిధ కారణాలతో ఈ ఫలితాల వెల్లడి ఆలస్యమైంది.

కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రూప్​ 4 ఫలితాలకు సంబంధించి అప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నింటినీ టీజీపీఎస్​సీ ఒక్కటొక్కటిగా అధిగమించింది. ఫిబ్రవరి 10వ తేదీన టీజీ​పీఎస్​సీ గ్రూప్​ 4 ఫలితాలను విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ కూడా పూర్తి చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ నెలలోనే గ్రూప్​ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి అధికారులను ఏర్పాట్లు మొదలయ్యాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!