దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్కు ఉద్యోగాల భర్తీకి విడుదలైన ఐబీపీఎస్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువును జులై 28 వరకు పెంచుతూ ప్రకటన విడుదలైంది. జులై 21తో చివరి తేదీ ముగిసిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
2025-–2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ)-XIV కి హాజరు కావాలనుకుని, ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి.