ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెం. 10/2026 విడుదల చేసింది.ఇందులో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా..కేవలం క్వాలిఫికేషన్ మెరిట్, ఎక్స్పీరియన్స్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జూన్ 13 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
APMSRB నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు :
స్టాఫ్ నర్స్ : 419 పోస్టులు (జీతం: రూ. 27,675)
ఫార్మసిస్ట్: 24 పోస్టులు (జీతం: రూ.23,393)
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ : 86 పోస్టులు (జీతం:రూ.23,494)
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 2026 జనవరి 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
అర్హతలు:
స్టాఫ్ నర్స్: బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎమ్ డిగ్రీతో పాటు APNMC కౌన్సిల్ రిజిస్ట్రేషన్ (రెన్యూవల్ అయి) ఉండాలి.
ఫార్మసిస్ట్: డీఫార్మసీ లేదా బీఫార్మసీ పూర్తి చేసి, ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
MRW: 10+2 తో పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్క్‌లో సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి.
ఎంపిక విధానం :
ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి ఎగ్జామ్ లేదు. మొత్తం 100 మార్కులకు గానూ మెరిట్ లిస్ట్ తీస్తారు.
క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కులు:75 మార్కులు
పాసైన సంవత్సరం వెయిటేజీ: ఏడాదికి 1 మార్కు చొప్పున (గరిష్టంగా 10 మార్కులు)
గవర్నమెంట్ సర్వీస్ వెయిటేజీ: కోవిడ్ డ్యూటీలు లేదా రూరల్/ట్రైబల్ ఏరియా సర్వీస్ ఆధారంగా (గరిష్టంగా 15 మార్కులు)
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: జూన్ 13 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేయడానికి చివరి తేదీ: జూన్ 30 వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: ఓపెన్ కేటగిరీకి రూ.1,200, కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ. 900 గా నిర్ణయించారు.
ఎలా అప్లై చేయాలి?:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apmsrb.ap.gov.inలోకి వెళ్లి ఆన్‌లైన్ మోడ్‌లోనే అప్లై చేయాలి. మీ ఎస్ఎస్‌సీ, స్టడీ సర్టిఫికెట్లు, కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.





