ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB).. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. క్లినికల్, నాన్-క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ (MD/MS/DNB) లేదా సూపర్ స్పెషాలిటీ (DM/MCh/DrNB) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 8 నుంచి 22వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాలు:
ఖాళీల వారిగా వివరాలు..
మొత్తం: 220 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్): 130
అసిస్టెంట్ ప్రొఫెసర్ (నాన్-క్లినికల్): 16
అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీ): 74
2. అర్హతలు
అభ్యర్థులు కింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
క్లినికల్/నాన్-క్లినికల్ విభాగాలకు MD, MS లేదా DNB పూర్తి చేసి ఉండాలి.
సూపర్ స్పెషాలిటీ విభాగాలకు DM, MCh లేదా DrNB పూర్తి చేసి ఉండాలి.
సీనియర్ రెసిడెన్సీ: క్లినికల్, నాన్-క్లినికల్ పోస్టులకు ఒక సంవత్సరం సీనియర్ రెసిడెన్సీ తప్పనిసరి.
స్థానికత: కేవలం ఏపీ స్థానిక అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.
రిజిస్ట్రేషన్: ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
3. వయస్సు: (01/07/2025 నాటికి)
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ. 68,900 నుంచి రూ. 2,05,500 వరకు ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు అదనంగా రూ. 30,000 అలవెన్స్ లభిస్తుంది.
4. అప్లికేషన్ ఫీజు :
ఓసీ (జనరల్) అభ్యర్థులకు రూ. 2,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
5. ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: అభ్యర్థులు జనవరి 8వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: జనవరి 22 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి ?
అర్హత గల అభ్యర్థులు dme.ap.nic.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.





