ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. జనవరిలో టీచర్ల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ‘టెట్ , డీఎస్సీ పరీక్షలకు సిద్ధం కావాలి’ అంటూ నిరుద్యోగులకు సూచించారు. స్పెషల్ డీఎస్సీ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
మొత్తం ఖాళీలు
స్పెషల్ డీఎస్సీ పోస్టులు –2,260, ఇందులో ఎస్టీజీతో పాటు స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులున్నాయి.
నవంబర్లో టెట్ పరీక్షలు
స్పెషల్ డీఎస్సీకి ముందే నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్ష అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి మార్చిలో పరీక్షలు నిర్వహిస్తారు. 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి కొత్త టీచర్లను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.





