Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఏపీ డీఎంఈలో 1070 పోస్టులు

ఏపీ డీఎంఈలో 1070 పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌(డీఎంఈ).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 1070 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. విభాగాలు–ఖాళీలు: జ‌న‌ర‌ల్ మెడిసిన్‌–360, ప‌ల్మన‌రీ మెడిసిన్‌–363, అనెస్తీషియాల‌జీ–347; అర్హత‌: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్లలో ఎండీ/డీఎన్‌బీ ఉత్తీర్ణత‌; వయసు: 2020 ఏప్రిల్​ 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు. సెలెక్షన్​ ప్రాసెస్​: అక‌డ‌మిక్ మెరిట్‌ ద్వారా;
చివ‌రి తేది: 2020 మే 7;
వివరాలకు: www.dme.ap.nic.in

రిమ్స్‌లో జూనియ‌ర్ రెసిడెంట్స్‌
ఇంఫాల్‌లోని రీజి‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్(రిమ్స్‌).. హాస్పిటల్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 39 జూనియర్​ రెసిడెంట్​ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: కార్డియోలజీ, క్యాజువాలిటీ, మెడికల్​ అంకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపేడిక్స్​, ప్లాస్టిక్ స‌ర్జరీ, నెఫ్రాల‌జీ, యూరాల‌జీ త‌దిత‌రాలు; అర్హత‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్​: ఇంట‌ర్వ్యూ ద్వారా;
చివ‌రి తేది: 2020 మే 5; ఇంట‌ర్వ్యూ: 2020 మే 26;
వివరాలకు: www.rims.edu.in

ఎన్‌బీఆర్‌సీలో 4 సైంటిస్ట్స్​
గుర్గామ్​లోని నేష‌నల్​ బ్రెయిన్ రీసెర్చ్ సెంట‌ర్‌(‌ఎన్‌బీఆర్‌సీ).. 4 సైంటిస్ట్/అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–-మెయిల్‌/ఆఫ్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్​: facultyrecruitment@nbrc.ac.in; ఫీజు: జనరల్​కు రూ.500, ఇతరులకు రూ.300;
చివ‌రి తేది: 2020 మే 5;
వివరాలకు: www.nbrc.ac.in

హైద‌రాబాద్ సీఐటీడీలో..​
హైద‌రాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌(సీఐటీడీ) పరిధిలోని ఎంఎస్ఎంఈ టూల్ రూం కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 5 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: హాస్టల్ వార్డెన్‌, ప‌ర్చేజ్ ఇంజినీర్‌, మెకానిక‌ల్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌, ఐటీ ఇంజినీర్‌; అర్హత‌: ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో డిప్లొమా/ బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; విభాగాలు: మెకానికల్​, ఎలక్ట్రికల్​ & ఎలక్ట్రానిక్స్​, ఈసీఈ/ఐటీ;
చివ‌రితేది: 2020 మే 10;
వివరాలకు: www.citdindia.org

బీఈసీఐఎల్‌లో 51 పోస్టులు
న్యూఢిల్లీలోని భార‌త ప్రభుత్వ స‌మాచార, ప్రసార మంత్రిత్వ శాఖ‌కు చెందిన మినీరత్న కంపెనీ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 51 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సైబ‌ర్ క్రైం థ్రెట్ ఇంటెలిజెన్స్‌ అన‌లిస్ట్‌, డిజిట‌ల్ ఫోరెన్సిక్ ఎక్స్‌ప‌ర్ట్‌, కంటెంట్ డెవలపర్​, మొబైల్ ఫోరెన్సిక్ ఎక్స్‌ప‌ర్ట్, నెట్​వర్క్​ ఫోరెన్సిక్​ ఎక్స్​పర్ట్​, డేటా అనలిస్ట్స్​ త‌దిత‌రాలు; అర్హత‌: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, బీసీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్‌ ద్వారా; ఈ–మెయిల్​: cyberjobs@becil.com;
చివ‌రితేది: 2020 మే 6;
వివరాలకు: www.becil.com

ఎయిమ్స్‌లో ల్యాబొరేట‌రీ టెక్నీషియన్స్​
భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 2 ల్యాబరేటరీ టెక్నీషియన్​ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–-మెయిల్ ద్వరా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: ఇంట‌ర్మీడియ‌ట్, డిప్లొమా ఇన్​ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్‌ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌వం; వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష; ఈ–-మెయిల్‌: icmramr@gmail.com;
చివ‌రి తేది: 2020 మే 3;
వివరాలకు: www.aiimsbhopal.edu.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!