ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 132 పోస్టులను ఏడాది కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇంకా మరికొన్ని పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మరిన్ని వివరాలు:
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA)
మొత్తం పోస్టులు: 132
పోస్టుల పేర్లు: అసిస్టెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, సూపర్ఇంటెండింగ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్/జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్, సీనియర్/జూనియర్ ఎలక్ట్రికల్/ఈఎల్‌యూ ఎక్స్‌పర్ట్, సీనియర్/జూనియర్ ప్లంబింగ్ ఎక్స్‌పర్ట్, సీనియర్/జూనియర్ హెచ్‌వీఏసీ ఎక్స్‌పర్ట్.
పోస్టుల వివరాలు, అర్హతలు:
సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు. అర్హత: ఫైర్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా, ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్స్ ఇన్‌స్టలేషన్ & సేఫ్టీ కంప్లయెన్స్‌లో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్: 04 పోస్టులు. అర్హత: ఫైర్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా, ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్స్ ఇన్‌స్టలేషన్ & సేఫ్టీ కంప్లయెన్స్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
సీనియర్ ఎలక్ట్రికల్/ఈఎల్‌యూ ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు. అర్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా, ఎలక్ట్రికల్ వర్క్స్ ఎగ్జిక్యూషన్, నిర్వహణలో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జూనియర్ ఎలక్ట్రికల్/ఈఎల్‌యూ ఎక్స్‌పర్ట్: 06 పోస్టులు. అర్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా, ఎలక్ట్రికల్ వర్క్స్ ఎగ్జిక్యూషన్,నిర్వహణలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
సీనియర్ ప్లంబింగ్ ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు. అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా, ప్లంబింగ్ ఎగ్జిక్యూషన్/నిర్వహణలో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జూనియర్ ప్లంబింగ్ ఎక్స్‌పర్ట్: 06 పోస్టులు. అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా, ప్లంబింగ్ ఎగ్జిక్యూషన్/నిర్వహణలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
సీనియర్ హెచ్‌వీఏసీ ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు. అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా, హెచ్‌వీఏసీ స్పెషలైజేషన్ తో హెచ్‌వీఏసీ ఎగ్జిక్యూషన్, నిర్వహణలో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జూనియర్ హెచ్‌వీఏసీ ఎక్స్‌పర్ట్: 06 పోస్టులు. అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/డిప్లొమా, హెచ్‌వీఏసీ స్పెషలైజేషన్ తో హెచ్‌వీఏసీ ఎగ్జిక్యూషన్, నిర్వహణలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
చీఫ్ ఇంజనీర్: 04 పోస్టులు. అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో 4 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
సూపర్ఇంటెండింగ్ ఇంజనీర్: 08 పోస్టులు. అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో 4 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: 15 పోస్టులు. అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో 4 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: 25 పోస్టులు. అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో 4 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ / అసిస్టెంట్ ఇంజనీర్: 50 పోస్టులు. అర్హత: సివిల్ లేదా సివిల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, లేదా జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్ డిగ్రీ ఉండాలి.
అప్లికేషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 26వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
కాంట్రాక్ట్: 1 సంవత్సరం.
అధికారిక వెబ్‌సైట్: crda.ap.gov.in
అప్లికేషన్ విధానం:
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీ లోగా APCRDA అధికారిక వెబ్‌సైట్ crda.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేయండి.





