ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, లాతో పాటు ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం పరీక్ష తేదీలను ప్రకటించింది. విద్యామండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ :
AP ECET – ఏప్రిల్ 4
AP ICET (MBA, MCA ప్రవేశాలు)- ఏప్రిల్ 28
AP PGECET (M.Tech/M.Pharm)-ఏప్రిల్ 29, 30, మే 2
AP LAWCET & EDCET-మే 4
AP PGCET- మే 5, 8, 9, 10, 11
AP EAPCET (Engineering)-మే 12, 13, 14, 15, 18
AP EAPCET (Agri & Pharmacy)-మే 19, 20





