ఏపీ టెన్త్ (2026) పరీక్షల షెడ్యూల్‌ను ఎస్.ఎస్.సి. బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుండగా.. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్:
మార్చి 16 సోమవారం- ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 1)
మార్చి 18 బుధవారం- సెకెండ్ లాంగ్వేజ్
మార్చి 20 శుక్రవారం- ఇంగ్లీష్
మార్చి 23 సోమవారం- మ్యాథమెటిక్స్ (గణితం
మార్చి 25 బుధవారం- ఫిజికల్ సైన్స్
మార్చి 28 శనివారం- బయోలాజికల్ సైన్స్
మార్చి 30 సోమవారం- సోషల్ స్టడీస్
మార్చి 31 మంగళవారం- ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్ 01 బుధవారం- సెకెండ్ లాంగ్వేజ్ (పేపర్ 2)





