ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP SET 2025) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను వెంటనే తెలుసుకోవచ్చు.
ఈ ఏపీ సెట్ పరీక్షలను ఆంధ్రయూనివర్సిటీ విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగాయి. ఈ నోటిఫికేషన్‌కు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 32,779 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం అప్లై చేసుకోగా.. వారిలో 27,025 మంది పరీక్షకు హాజరయ్యారు.
రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి?
- మొదట అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apset.aptonline.in ను ఓపెన్ చేయాలి.
2.హోంపేజీలో కనిపించే ‘AP SET 2025 Results’ లింక్‌పై క్లిక్ చేయాలి.
3.అక్కడ మీ హాల్‌టికెట్ నంబర్ (Hall Ticket Number), పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను ఎంటర్ చేయాలి.
- వివరాలు సబ్‌మిట్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోండి.





