HomeJOBSఏపీ పవర్ సెక్టార్‌లో.. 629 ఏఈఈ పోస్టులు

ఏపీ పవర్ సెక్టార్‌లో.. 629 ఏఈఈ పోస్టులు

ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఎనర్జీ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఏపీ పవర్ సెక్టార్ పరిధిలోని వివిధ సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఏయే సంస్థల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సంస్థ పేరు:ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ (AP Power Utilities).
పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE).
మొత్తం ఖాళీలు: 629 పోస్టులు.
అఫీషియల్ వెబ్‌సైట్: https://apgenco.gov.in
సంస్థల వారీగా ఖాళీల వివరాలు:
ఏపీ విద్యుత్ రంగానికి చెందిన 5 ప్రధాన సంస్థల్లో ఈ 629 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

APTRANSCO (ఏపీ ట్రాన్స్‌కో): 200 పోస్టులు

APGENCO (ఏపీ జెన్‌కో): 100 పోస్టులు

APSPDCL (దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ): 134 పోస్టులు

APEPDCL (తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ): 135 పోస్టులు

APCPDCL (మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ): 60 పోస్టులు

అర్హతలు, వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలను కలిగి ఉండాలి.

  1. విద్యా అర్హత:
    అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ / బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

ఎలక్ట్రికల్ వింగ్: బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.

సివిల్ వింగ్: బీటెక్ సివిల్ ఇంజనీరింగ్.

టెలికాం వింగ్: బీటెక్ టెలికమ్యూనికేషన్స్/సంబంధిత ఇంజనీరింగ్.

  1. వయస్సు:
    కనీస వయస్సు: 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు మించకూడదు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ, జీతం:
ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

జీతం: విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఏఈఈ పోస్టులకు ఆకర్షణీయమైన జీతంతో పాటు అలవెన్సులు, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ లభిస్తాయి.

అప్లికేషన్ ప్రారంభ, చివరి తేదీలు: త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తారు.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు కింది విధంగా అప్లై చేసుకోవచ్చు.

1.మొదట ఏపీ పవర్ యూటిలిటీస్ అధికారిక వెబ్‌సైట్ https://apgenco.gov.in/ లోకి లాగిన్ అవ్వండి.

2.’AEE Recruitment 2026′ లింక్‌పై క్లిక్ చేసి.. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.

3.మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీతో ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

4.ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.

  1. మీ ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
  2. కేటగిరీని బట్టి ఫీజు చెల్లించి,అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here