ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే.. ఏపీ పాలిసెట్( AP POLYCET 2026) అప్లికేషన్ గడువు త్వరలోనే ముగియనుంది.స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ఈ పరీక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. ఏపీ పాలిసెట్ ద్వారా సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ వంటి త్రీ-ఇయర్ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు. విద్యార్థులు ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్లలో.. ఏప్రిల్ 25వ తేదీన పరీక్షలు జరుగుతాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 9 వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 25న వివిధ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఫలితాల వెల్లడి: మే రెండో వారంలో రిజల్ట్ ప్రకటిస్తారు.
2.అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులకు..రూ. 400 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
3.అర్హతలు:
విద్యార్హత:గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి.ఈ ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు.
కనీస మార్కులు: మ్యాథ్స్,సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 35% మార్కులు సాధించి ఉండాలి.
- పరీక్షా విధానం :
పరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. ఎలాంటి నెగటివ్ మార్క్స్ ఉండవు.
గణితం – 50 మార్కులు
ఫిజిక్స్- 40 మార్కులు
కెమిస్ట్రీ- 30 మార్కులు - అప్లై చేయడం ఎలా?
1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.in లోకి లాగిన్ అవ్వండి.
2.మీ టెన్త్ హాల్ టికెట్ నంబర్, అవసరం అయిన వివరాలు ఎంటర్ చేయండి.
3.నిర్దేశించిన ఫీజును చెల్లించి, ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
4. చివరగా అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.





