ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) రాష్ట్రంలో ఏకంగా 2,050 ఎస్సై , కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సై విభాగంలో సివిల్, ఏఆర్, ఎస్సీఎఫ్, కమ్యూనికేషన్, పీటీవో పోస్టులు ఉండగా.. కానిస్టేబుల్ విభాగంలో సివిల్, ఏఆర్, ఫైర్, జైలు వార్డర్, డ్రైవర్, మెకానిక్, హైటెక్నిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. త్వరలోనే రాత పరీక్ష తేదీలను కూడా బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు.
ఎస్సై , కానిస్టేబుల్ పోస్టులు:
ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎస్సై , కానిస్టేబుల్ కేటగిరీల్లో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టులు (మొత్తం: 378)
సివిల్ ఎస్ఐ (పురుషులు & మహిళలు): 253 పోస్టులు
ఏఆర్ ఎస్ఐ (పురుషులు & మహిళలు): 116 పోస్టులు
ఎస్పీఎఫ్ ఎస్ఐ (పురుషులు): 9 పోస్టులు
- ప్రత్యేక విభాగం ఎస్ఐ పోస్టులు (మొత్తం: 60)
కమ్యూనికేషన్స్ ఎస్ఐ (పురుషులు & మహిళలు): 50 పోస్టులు
పీటీఓ ఎస్ఐ (పురుషులు): 10 పోస్టులు
- పోలీస్ కానిస్టేబుల్స్, ఫైర్ & ప్రిజన్స్ పోస్టులు (మొత్తం: 1,156)
సివిల్ కానిస్టేబుల్స్ (పురుషులు & మహిళలు): 542 పోస్టులు
ఏఆర్ కానిస్టేబుల్స్ (పురుషులు & మహిళలు): 285 పోస్టులు
ఫైర్‌మెన్ (ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్): 158 పోస్టులు
జైలు వార్డర్లు (పురుషులు): 150 పోస్టులు
జైలు వార్డర్లు (మహిళలు): 21 పోస్టులు
- కమ్యూనికేషన్స్ & పీటీఓ కానిస్టేబుల్స్ (మొత్తం: 213)
కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్స్ (పురుషులు & మహిళలు): 200 పోస్టులు
పీటీఓ మెకానిక్స్ (పురుషులు): 15 పోస్టులు
పీటీఓ డ్రైవర్లు (పురుషులు): 198 పోస్టులు
- సైంటిఫిక్ అసిస్టెంట్స్ – ఎఫ్ఎస్ఎల్ (FSL) (మొత్తం: 43)
ఫిజికల్: 10 పోస్టులు
కెమికల్: 13 పోస్టులు
బయాలజీ / సెరాలజీ: 20 పోస్టులు
ముఖ్యమైన వివరాలు:
అప్లికేషన్ విధానం: అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
పరీక్ష తేదీలు: ఆన్లైన్ అప్లికేషన్ల స్వీకరణ,రాత పరీక్షకు సంబంధించిన తేదీలను బోర్డు త్వరలోనే ప్రకటించనుంది.





