ఏపీలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీఈసెట్ (AP PGECET)-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 9, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్‌ను ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) తరపున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU), తిరుపతి నిర్వహిస్తుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో M.Tech, M.Pharmacy కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్:
ప్రారంభ తేదీ: జులై 9, 2025
వెబ్‌సైట్: cets.apsche.ap.gov.in/PGECET, pgecet-sche.aptonline.in
కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది ?
AP PGECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రధానంగా కింది దశలు ఉంటాయి:
రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు: అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని, కౌన్సెలింగ్ ఫీజును చెల్లించాలి.
డాక్యుమెంట్ అప్‌లోడ్ , వెరిఫికేషన్: అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ సర్టిఫికెట్లను అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు.
వెబ్ ఆప్షన్స్ : ధృవీకరణ పూర్తయిన తర్వాత, అభ్యర్థులు తమకు నచ్చిన కోర్సులు, కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు.
సీట్ల కేటాయింపు: అభ్యర్థులు పొందిన ర్యాంకు, వెబ్ ఆప్షన్లు, రిజర్వేషన్‌ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
సెల్ఫ్-రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టింగ్: సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆన్‌లైన్‌లో సెల్ఫ్-రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత గడువులోగా కాలేజీలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లతో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
అవసరమైన డాక్యుమెంట్స్:
AP PGECET/GATE/GPAT ర్యాంక్ కార్డ్.
AP PGECET హాల్ టికెట్.
ప్రొవిజనల్ సర్టిఫికెట్/డిగ్రీ సర్టిఫికెట్.
మార్క్స్ మెమోలు.
SSC/ఇంటర్ మార్క్స్ మెమో.
స్టడీ సర్టిఫికెట్లు (క్లాస్ 6 నుంచి డిగ్రీ వరకు.)
కుల ధ్రువీకరణ పత్రం.
ఆదాయ ధ్రువీకరణ పత్రం.
ఆధార్ కార్డ్.
రెసిడెన్స్ సర్టిఫికెట్.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.





