HomeLATESTఆంధ్రప్రదేశ్​ కేజీబీవీల్లో 604 పోస్టులకు నోటిఫికేషన్​

ఆంధ్రప్రదేశ్​ కేజీబీవీల్లో 604 పోస్టులకు నోటిఫికేషన్​

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు షార్ట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని కాంట్రాక్ట్​ ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపడతారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

ఖాళీల వివరాలు: ప్రిన్సిపల్- 10; పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ)- 165; సీఆర్టీ (సీఆర్​టీ)- 163; ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ)- 4; పార్ట్ టైం టీచర్ (పీటీటీ)-165, వార్డెన్- 53; అకౌంటెంట్- 44. మొత్తం 604 ఖాళీలున్నాయి. వయసు ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18- నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 26 నుంచి అక్టోబర్​ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు రూ.250 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.apkgbv.apcfss.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!