HomeJOBSఏపీ కేజీబీవీల్లో 299 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక!

ఏపీ కేజీబీవీల్లో 299 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక!

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు ఏపీ విద్యాశాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (AP KGBV) ఖాళీగా ఉన్న 299 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం అభ్యర్థుల అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు చేపడుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ నియామకాలను పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభ తేదీ: మే 27వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయడానికి చివరి తేదీ: జూన్ 5వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

తాత్కాలిక మెరిట్ లిస్ట్ విడుదల: జూన్ 7న 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి లిస్ట్ విడుదల చేస్తారు.

పోస్టుల వివరాలు – విద్యార్హతలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ప్రిన్సిపాల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో పీజీతో పాటు తప్పనిసరిగా బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: సంబంధిత సబ్జెక్టులో (ఇంగ్లీష్,మ్యాథ్స్,ఫిజిక్స్ ) 50% మార్కులతో పీజీ,బీఈడీ పూర్తి చేసి ఉండాలి.

కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT): సంబంధిత సబ్జెక్టులలో కనీసం 50% మార్కులతో డిగ్రీ లేదా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. అదనంగా అభ్యర్థులు తప్పనిసరిగా AP TET లేదా CTET (Paper-II) లో క్వాలిఫై అయి ఉండాలి.

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET): ఇంటర్ లేదా డిగ్రీతో పాటు NCTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి U.G.D.P.Ed, B.P.Ed లేదా M.P.Ed (ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ/డిప్లొమా) పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం,సొంత జిల్లాలోనే పోస్టింగ్:
అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కులు, ప్రభుత్వ రోస్టర్ నిబంధనల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు వారి సొంత జిల్లాల్లోనే ఖాళీలను బట్టి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

జీతం వివరాలు:
కేజీబీవీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు అందించే జీతం వివరాలు..

ప్రిన్సిపాల్ పోస్టుకు: రూ. 34,139

PGT, CRT, PET పోస్టులకు: రూ. 26,759

అప్లికేషన్ ఫీజు:
అర్హత కలిగిన అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి కేటగిరీ మినహాయింపులు లేవు.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ kgbvrecruitment.apcfss.in సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here